ENGLISH | TELUGU  
Home  » TV News

Eto Vellipoyindhi Manasu : డిటెక్టివ్ చెప్పినా నమ్మని సీతాకాంత్.. ఆ నిజం తెలిసిపోయిందా!

on Oct 5, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -218 లో.. నువ్వు అమావాస్య రోజు వరకు ఇంట్లో నుండి వెళ్ళకని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. మీరు నా గురించి ఇంత ఆలోచిస్తన్నప్పుడు నేను మీ మాట వింటాను. ఎక్కడికి వెళ్ళనని రామలక్ష్మి అంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళానంటూ మాట ఇవ్వు అనగానే సీతాకాంత్ కి రామలక్ష్మి మాటిస్తుంది.

ఆ తర్వాత నందిని ఇంటికి వస్తుందిమ సందీప్ ని ఇదంతా చేసాడని ఏది క్లారిటీగా తెలియడం లేదని నందినికి హారిక చెప్తుంది. కానీ నందిని సీతాకాంత్ విషయం లో ఎమోషనల్ అవుతుంది. నన్ను ఎందుకు సీతా తప్పుగా అపార్థం చేసుకుంటున్నాడు. తన ప్రేమ కావాలని మాత్రమే కోరుకుంటున్నాను కదా అని నందిని అంటుంది. నాకు సీతా కావాలి లేదంటే నేను ఉండలేనని నందిని ఎమోషనల్ అవుతుంది. అదంతా డిటెక్టివ్ వింటుంటాడు. పక్కకి వెళ్లి డిటెక్టీవ్ సీతాకాంత్ కి ఫోన్ చేస్తాడు. మీరు నందిని గారిని తప్పు అర్ధం చేసుకున్నారు కేవలం ఆమె మీపై ప్రేమతో మాత్రమే ఉంది పగతో లేదని చెప్తాడు. దానికి సాక్ష్యం ఉందా అని సీతాకాంత్ అడుగుతాడు. చెడుకి సాక్ష్యం కావాలి కానీ మంచికి ఎందుకని డిటెక్టివ్ అంటాడు. నాకు కావాలని సీతాకాంత్ అంటాడు.

ఆ తర్వాత సీతాకాంత్ పై ఎటాక్ చేసిన రౌడీ.. సీతాకాంత్ ఇంటికి వచ్చి బొకే ఇస్తాడు. సందీప్ డబ్బులు ఇవ్వలేదని బాంబు పెడుతాడు‌. సెక్యూరిటీతో ఆ బొకే పంపిస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి ఏంటని చూసేసరికి.. అందులో పెండ్రైవ్ ఉంటుంది. పెన్ డ్రైవ్ లో గుడిలో యాగం చేసిన ఫోటోలు ఉంటాయి. ఇవి  ఆ రౌడీ గాడు పంపి ఉంటాడని శ్రీలత టెన్షన్ పడుతుంది. ఎవరు పంపి ఉంటారని సీతాకాంత్ అంటాడు. ఎవరో నీకు తెలిసిన వాళ్ళు అయి ఉంటారని శ్రీలత అంటుంది. ఆ తర్వాత సందీప్ దగ్గరికి శ్రీలత వెళ్లి.. వాడి డబ్బులు వాడికి ఇవ్వమంటూ కోప్పడుతుంది. ఆ తర్వాత రౌడీతో సందీప్ ఫోన్ మాట్లాడుతుంటే.. అప్పుడే రామలక్ష్మి వచ్చి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.